రెండు పార్ట్‌లుగా మ‌రో బ‌యోపిక్

Sat,October 27, 2018 11:29 AM
Badminton Player biopic in two parts

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోను బ‌యోపిక్‌ల హ‌వా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత నేప‌థ్యంలో ఎన్టీఆర్ అనే చిత్రం తెర‌కెక్కుతుండ‌గా ఈ మూవీని జన‌వ‌రిలో రెండు పార్టులుగా విడుద‌ల చేయ‌నున్నారు. క‌థానాయ‌కుడు , మ‌హానాయ‌కుడు అనే పేర్ల‌తో ఎన్టీఆర్ బ‌యోపిక్ విడుదల కానుంది. ఇప్పుడు పుల్లెల గోపిచంద్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న చిత్రాన్ని కూడా రెండు పార్ట్‌లుగా విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.

బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌, కోచ్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ కూడా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుండ‌గా ఈ చిత్రాన్ని ప్ర‌వీణ్ స‌త్తారు తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ కోసం ప్ర‌వీణ్ చాలా రీసెర్చ్‌లు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇండస్ట్రీలోకి యువ కెరటంలా దూసుకు వచ్చిన మహేష్ బావ సుధీర్ బాబు బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. సుధీర్ స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడం, పుల్లెల గోపిచంద్‌తో సుధీర్‌కు మంచి సాన్నిహిత్యం ఉండడంతో ఈ ప్రాజెక్ట్‌ని ఓకే చేసేందుకు సుధీర్ ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. పలు పెద్ద ప్రొడక్షన్ సంస్థలు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వస్తున్నాయని, తెలుగు, హిందీ భాషలలో ఈ చిత్రం తెరకెక్కనుందని అంటున్నారు. గోపిచంద్ జీవితంలో ఎన్నో విజ‌యాలు ఉండ‌గా, వాట‌న్నింటిని ఒకే పార్ట్‌లో చూపించ‌లేమ‌ని భావిస్తున్న మేక‌ర్స్ రెండు పార్ట్‌లుగా విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.

2295
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles