బాహుబలి నాముందు మోకరిల్లాడు..

Tue,August 27, 2019 04:33 PM

ముంబై: ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరో,హీరోయిన్లుగా నటించిన భారీ యాక్షన్ సినిమా సాహో. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 30న విడుదలకానున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ నటుడు చుంకీ పాండే మాట్లాడుతూ.. ప్రభాస్ క్రమశిక్షణ కలిగిన నటుడని, అతడు సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరినీ మర్యాదగా పిలుస్తాడనీ, అంత స్టార్‌డమ్ ఉన్నా చాలా సాధారణంగా ఉంటాడని ఈ సందర్భంగా ఆయన అన్నారు.


ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ప్రభాస్ నా ముందు మోకాళ్లపై కూర్చుంటాడు. ఆ సమయంలో నాకు బాహుబలి నాముందు మోకరిల్లాడనిపించిందని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్, పాటలు అభిమానులను అలరిస్తున్నాయి.

6785
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles