ఫ‌స్ట్ వినాయ‌క్.. ఆ త‌ర్వాత బోయ‌పాటి

Fri,December 21, 2018 12:23 PM
bala krishna next with vinayak

నంద‌మూరి బాల‌కృష్ణ వ‌రుస సినిమాల‌తో అభిమానుల‌ని అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ అనే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న బాల‌య్య త్వ‌ర‌లో బోయ‌పాటితో సినిమా చేయ‌నున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జరిగింది. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం బాల‌కృష్ణ త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్‌ని వినాయ‌క్‌తో చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. బోయ‌పాటి కొద్ది రోజులుగా విన‌య విధేయ రామ అనే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న స్క్రిప్ట్ సిద్దం చేయ‌లేద‌ట‌. బోయ‌పాటి- బాల‌య్య ప్రాజెక్ట్ భారీ బ‌డ్జెట్ సినిమా కావ‌డం, దీనికి మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉన్నందున ముందుగా వినాయ‌క్‌తో సినిమా చేయాల‌ని బాల‌య్య భావిస్తున్నాడని అంటున్నారు. వినాయ‌క్ - బాల‌య్య సినిమాకి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇందులో బాల‌య్య‌ని వినాయ‌క్ ఏ రేంజ్‌లో చూపిస్తాడో మ‌రి.

2155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles