బాల‌కృష్ణ తాజా చిత్రానికి ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్

Wed,October 16, 2019 09:21 AM

నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం కేఎస్ ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో బాల‌య్య లుక్‌కి సంబంధించి ప‌లు పోస్ట‌ర్స్ ఇటీవ‌ల విడుద‌ల కాగా, బాల‌య్య గెట‌ప్ చూసి ఫ్యాన్స్ అవాక్క‌య్యారు. పోలీస్ ఆఫీస‌ర్‌గా ఉన్న బాల‌య్య గ్యాంగ్ స్ట‌ర్‌గా ఎలా మారాడ‌నేదే చిత్ర క‌థ అని చెబుతున్నారు. ఈ చిత్రానికి ‘క్రాంతి’ , ‘జడ్జిమెంట్’, ‘డిపార్ట్‌మెంట్’ అనే ప‌లు టైటిల్స్ ఫిక్స్ చేయ‌నున్నారంటూ ప్రచారం జ‌రిగింది. కాని ఈ చిత్రానికి రూల‌ర్ అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. చిత్ర శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న జెమినీ టీవి త‌మ ట్విట్ట‌ర్‌లో రూల‌ర్ ఉప‌గ్ర‌హ హ‌క్కుల‌ని సొంతం చేసుకున్న‌ట్టు తెలిపింది. దీంతో బాల‌య్య 105వ చిత్ర టైటిల్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈనెల 18 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
2799
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles