కారు న‌డుపుతూ సెల్ఫీ వీడియో.. చుర‌కలు అంటించిన పోలీసులు

Tue,January 14, 2020 12:31 PM

బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన క‌న్న‌డ న‌టి సంజ‌న‌. చివ‌రిగా తెలుగులో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్‌తో అల‌రించింది. ప్ర‌స్తుతం త‌మిళ సినిమాల‌తో బిజీ ఉన్న అమ్మ‌డు బాక్సర్‌, పొడముండమ్ అనే సినిమాలు చేస్తుంది. అయితే మ‌హేష్‌కి హార్డ్‌కోర్ ఫ్యాన్ అయిన సంజ‌న రీసెంట్‌గా స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాన్ని వీక్షించేందుకు వెళ్లింది.

సినిమాకి వెళ్ళే స‌మ‌యంలో సంజ‌న కారు డ్రైవ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకుంది. అంతేకాదు దీనిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. సెల్ఫీ వీడియోపైనే పూర్తి దృష్టి పెట్టి డ్రైవింగ్ చేయ‌డంపై   బెంగళూరు ట్రాఫిక్‌ పోలీస్‌లు సీరియస్‌ అయ్యారు. విచారణకు హాజరు కావాలంటూ ఆమెకు నోటీసులు జారీ చేశారు. న‌లుగురికి ఆద‌ర్శంగా నిల‌వాల్సిన సెల‌బ్రిటీలు ఇలా చేయడం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాంటి  వీడియోలు సోష‌ల్ మీడియాలో పెడితే వాటి వ‌ల‌న అభిమానులు కూడా ప్ర‌భావితం అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి చ‌ర్య‌లు మానుకోండ‌ని మిగ‌తా వారిని కూడా హెచ్చ‌రిస్తున్నారు పోలీసులు.

1348
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles