వాలెంటైన్స్ డే రోజు ప్రియా, ర‌ణ‌వీర్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోటీ

Sat,February 9, 2019 11:27 AM

ఒరు ఆదార్ ల‌వ్ చిత్రంతో వెండితెర‌కి ప‌రిచ‌య‌మవుతున్న ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్.. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణవీర్ సింగ్‌తో పోటీ ప‌డేందుకు సిద్ద‌మైంది. ల‌వ‌ర్స్ డే ( ఫిబ్ర‌వ‌రి 14) ని పున‌స్క‌రించుకొని వీరు న‌టించిన చిత్రాలు విడుద‌ల కానుండగా, రెండు చిత్రాల‌పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. క‌న్నుగీటుతో అంద‌రి దృష్టిని త‌న‌వైపుకి తిప్పుకున్న ప్రియా ప్ర‌కాశ్ ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌లో త‌న కోస్టార్ రోష‌న్ అబ్దుల్లాతో లిప్ లాక్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలిచింది. దీంతో ఒరు ఆదార్ ల‌వ్ సినిమా చూడాల‌నే ఆస‌క్తి కేవ‌లం సౌత్‌లోనే కాదు నార్త్ ప్రేక్ష‌కులోను ఉంది. ఇక ర‌ణ‌వీర్ న‌టించిన తాజా చిత్రం గ‌ల్లీబాయ్ మూవీ టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లు అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొల్ప‌గా, ఈ సినిమా కూడా అభిమానుల దృష్టిని ఆక‌ర్షిస్తుంది. అయితే ఆన్‌లైన్ డాటా బేస్ సంస్థ ఐఎండీబీ ప్రేక్ష‌కులు ఏ సినిమా కోసం ఎక్కువ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారో వాటి లిస్ట్‌ని రిలీజ్ చేసింది. ఇందులో ఒరు ఆదార్ ల‌వ్ చిత్రం 28.4 శాతంతో మొద‌టి స్థానంలో ఉండ‌గా, రెండో స్థానంలో గ‌ల్లీబాయ్(25.4) ఉంది. అంటే ర‌ణ‌వీర్ సినిమా క‌న్నా కూడా ప్రియా ప్ర‌కాశ్ సినిమాపైనే అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. శ్రీదేవి బంగ్లా అనే చిత్రంతో త్వ‌ర‌లో బాలీవుడ్‌కి ప‌రిచ‌యం కానుంది ప్రియా ప్ర‌కాశ్‌.


2250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles