అస‌లు ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ ఎలా కుదిరింది ?

Thu,March 14, 2019 01:17 PM

ఇద్ద‌రు టాలీవుడ్ టాప్ హీరోల‌తో స్టార్ డైరెక్ట‌ర్ సినిమా అంటే ఆ ప్రాజెక్ట్‌పై అంచ‌నాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి ఓ రోజు త‌న ట్విట్ట‌ర్‌లో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేశాడు. ఆ త‌ర్వాత ముగ్గురి కాంబినేష‌న్‌లో ఆర్ఆర్ఆర్ అనే ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాం అని అన్నాడు. దీంతో అభిమానుల‌లో ఓ రేంజ్‌లో చ‌ర్చ జ‌రిగింది. ఇంత స‌డెన్‌గా రాజ‌మౌళి ఇద్ద‌రు హీరోల‌కి క‌థ చెప్పి ఎలా ఒప్పించాడు అని భారీ డిస్కష‌న్స్ జ‌రిపారు. దీనిపై ఇన్నాళ్లు ఎలాంటి క్లారిటీ లేక‌పోగా, తాజాగా జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ ఎలా కుదిరింది అనే విష‌యం చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాడు చెర్రీ.


ఒక రోజు ఊరికి వెళ్ళేందుకు ఎయిర్ పోర్ట్‌కి వెళుతున్నాను. అయితే శంషాబాద్ ఏరియాలోనే త‌న ఇల్లు ఉంద‌ని ఒక‌సారి ర‌మ్మ‌ని రాజ‌మౌళి చెప్ప‌డంతో వారింటికి వెళాను. ఆయ‌న ఇంట్లోకి వెళ్ల‌గా మంచి పోజ్‌లో నేల మీద రిలాక్స్ అయి కూర్చున్నాడు తార‌క్‌. న‌న్ను చూసి తార‌క్ షాక్ అయ్యాడు. నేను అతనిని చూసి షాక్ అయ్యాను. మీ ఇద్ద‌రు ఏద‌న్నా మాట్లాడుకునేది ఉంటే బ‌య‌ట‌కి వెళ‌తాన‌ని తార‌క్ అన్నాడు. లేదు మీ ఇద్ద‌రు ఏద‌న్నా విష‌యం గురించి మాట్లాడుతుంటే నేను బ‌య‌ట వెయిట్ చేస్తాన‌ని అన్నాను. కాని అప్పుడు రాజ‌మౌళి అలాంటిదేమి లేదు అని చెప్పి ఇద్ద‌రిని లోప‌లికి తీసుకెళ్లి ఆర్ఆర్ఆర్ గురించి చెప్పాడు. స్టోరీ విన్న ఇద్ద‌రం ఆ ఆనందాన్ని త‌ట్టుకోలేక రాజ‌మౌళిని హ‌గ్ చేసుకొని కృత‌జ్ఞ‌త‌లు తెలిపాం. అది జ‌రిగిన కొద్ది సేప‌టి త‌ర్వాత దిగిన ఫోటోనే ఇప్పుడు మీరు చూసేది. రాజ‌మౌళితో రెండో సారి న‌టించ‌డం,తార‌క్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని చెర్రీ చెప్పుకొచ్చాడు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న షెడ్యూల్‌లో ఇద్ద‌రు హీరోలు పూర్తి స్థాయిలో రెగ్యుల‌ర్ షూటింగ్‌లో పాల్గొన‌నున్నార‌ని అంటున్నారు.

2247
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles