వ‌ర్మ 'భైర‌వ‌గీత' ట్రైల‌ర్ విడుద‌ల‌

Sun,November 4, 2018 07:47 AM
bhairava geetha trailer released

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ స‌మ‌ర్పిస్తున్న చిత్రం భైర‌వ‌గీత‌. ఆర్జీవి శిష్యుడు సిద్ధార్ద్ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో ఆలోచనను ఆలోచించిన మనిషిని చంపలేకపోతే ఏం చెయ్యాలా? ఆ ఆలోచన ఎవరి గురించో వారిని చంపేస్తే సరిపోద్ది అయ్యా.. అనే డైలాగ్ సినిమా ఎలా ఉండ‌నుందో తెలుపుతుంది. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాకు వర్మ దర్శకత్వం వహించకపోయినా.. సిద్ధార్థ్‌కు అన్నివిధాలా సహకరించినట్లు తెలుస్తోంది. ఇంత‌క ముందు ఓ ట్రైల‌ర్ విడుద‌ల చేసి సినిమాపై అంచ‌నాలు పెంచిన యూనిట్‌, తాజాగా మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేసి మ‌రింత ఆస‌క్తి క‌న‌బ‌ర‌చేలా చేశారు. వాస్త‌వ ఘ‌ట‌న‌లు ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ ప్రేమ క‌థ చిత్రంలో ధనుంజయ్, ఇర్రామోర్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ‘‘మనుషులను బానిసలుగా చూసే ప్రతి ఒక్కరి గుండెల్లో దింపే కత్తే దీనికి సమాధానం’’ అంటూ ఫ్యాక్షన్ పెద్దలపై తిరుగుబాటును కూడా ఈ ట్రైలర్లో చూపించారు. ‘‘సాటి మనుషులను బానిసలుగా చూడాలంటే నీ గుండెలు అదరాలి’’ అంటూ ముగించి సినిమాలపై అంచనాలు పెంచారు. ఈ సినిమా నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

2033
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles