బాహుబ‌లి స్టైల్‌లో 'భార‌త్' ప్ర‌మోష‌న్స్

Thu,April 18, 2019 12:55 PM
bharat promotions as baahubali style

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాలు దాటించిన చిత్రం బాహుబ‌లి. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్రమాలు ప్రేక్ష‌కుల‌లో సినిమాపై మ‌రింత ఆసక్తిని క‌లిగించాయి. చిత్రానికి సంబంధించి రోజుకొక పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెంచారు. ఇప్పుడు అదే స్టైల్‌లో భార‌త్ మూవీ యూనిట్ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టింది.

అలీ అబ్బాస్‌ జాఫర్‌ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భార‌త్ చిత్రంలో స‌ల్మాన్ స‌ర‌స‌న క‌థానాయిక‌లుగా క‌త్రినా కైఫ్‌, దిశా ప‌ఠానీ న‌టించారు. చిత్రంలో సల్మాన్‌ 20 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు వివిధ రకాల లుక్స్‌లో కనిపిస్తారట. ఈ చిత్రాన్ని జూన్ 8న ఈద్ కానుక‌గా విడుద‌ల చేయ‌నున్నారు. అయితే కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు. స‌ల్మాన్ ఖాన్ ముస‌లి లుక్, యంగ్ లుక్ విడుద‌ల చేసిన టీం నిన్న గ‌ని కార్మికుడిగా ఉన్న స‌ల్మాన్ లుక్ విడుద‌ల చేసింది. ఇక తాజాగా నేవి అధికారుడిగా స‌ల్మాన్‌కి సంబంధించిన‌ లుక్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది. టబు, సునీల్‌ గ్రోవర్‌, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

1437
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles