భార‌త్ : స‌్లో మోష‌న్ సాంగ్ వీడియో విడుద‌ల‌

Thu,April 25, 2019 01:21 PM
Bharat Slow Motion Song video released

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం ‘భారత్’. ఈ చిత్రంలో స‌ల్మాన్ దాదాపు ఐదు గెట‌ప్స్‌లో క‌నిపించ‌నున్నాడు. వృద్దుడిగా, యువ‌కుడిగా, గ‌ని కార్మికుడిగా, నేవీ అధికారిగా ప‌లు పాత్ర‌ల‌లో సంద‌డి చేయ‌నున్నాడు. ఈద్ కానుక‌గా జూన్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి. మొద‌ట చిత్ర పోస్ట‌ర్స్ విడుద‌ల చేసిన టీం రీసెంట్‌గా ట్రైల‌ర్ విడుద‌ల చేసింది. ఈ ట్రైల‌ర్‌కి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక తాజాగా స్లో మోష‌న్ అనే సాంగ్ వీడియో విడుద‌ల చేసింది. మేఘ‌దీప్ బోస్ సంగీత సార‌థ్యంలో రూపొందిన ఈ సాంగ్‌కి ఇర్ష‌ద్ క‌మ‌ల్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌లో స‌ల్మాన్ , దిషా ప‌ఠానీల సంద‌డి చూస్తుంటే సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరుగుతున్నాయి. చిత్రంలో సునీల్ గ్రోవర్, జాకీష్రాప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దక్షిణ కొరియాలో ఘనవిజయం సాధించిన ‘ఓడ్ టు మై ఫాదర్’ చిత్రానికి రీమేక్‌గా భారత్ తెరకెక్కుతోంది.

872
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles