మహేష్ బాబు హిందీ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌

Sat,October 13, 2018 11:07 AM
BHARAT  The Great Leader trailer released

టాలీవుడ్ నటుడు మహేశ్ బాబుకు దక్షిణాది సినీ పరిశ్రమలోనే కాకుండా వేరే రాష్ట్రాల‌లోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది మహేశ్ నటించిన భరత్ అనే నేను బాక్సాపీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా నాన్ బాహుబలి రికార్డు (బాహుబలిని మినహాయించి)ను కూడా సొంతం చేసుకుంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఫిక్ష‌న్ నేప‌థ్యంతో తెర‌కెక్కిన ఈ చిత్రంలో కైరా అద్వానీ క‌థానాయిక‌గా న‌టించింది. ఈ చిత్రంలో మ‌హేష్ డైన‌మిక్ సీఎంగా క‌నిపించి సంద‌డి చేశాడు. తెలుగులో ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రం త‌మిళంలో భ‌ర‌త్ ఎనుము పేరుతో విడుద‌ల కాగా, మ‌ల‌యాలంలో భ‌ర‌త్ ఎన్న అంజాన్‌గా రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు హిందీలో అనువాదం జ‌రుపుకున్న ఈ చిత్రం విడుద‌ల‌య్యేందుకు సిద్ధం కాగా, తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. భార‌త్ :ది గ్రేట్ లీడ‌ర్ పేరుతో విడుద‌ల కానున్న చిత్ర ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఆర్ఎజీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని హిందీలో విడుద‌ల చేస్తుంది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

4196
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles