వెబ్ సిరీస్‌లో న‌టించేందుకు సిద్ద‌మైన భూమిక‌

Thu,July 18, 2019 08:20 AM
Bhumika Chawla part in bhram web series

డిజిట‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన ప‌లు ప్లాట్ ఫామ్స్‌పై ఆడియ‌న్స్ ఎక్కువ‌గా దృష్టి సారిస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో అయితే వెబ్ సిరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఏర్ప‌డింది. వాటికి ఎక్కువ‌ ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డంతో టాప్ స్టార్స్ కూడా ఇందులో భాగం అవుతున్నారు. అప్ప‌ట్లో నిహారిక ప‌లు వెబ్ సిరీస్‌లు చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైంది. స‌మంత కూడా ఓ వెబ్ సిరీస్‌లో న‌టించేందుకు సిద్ధ‌మైంది. శ్రీకాంత్ కూడా చద‌రంగం అనే వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నాడు. ఇక అల‌నాటి అందాల తార భూమిక కూడా ‘భ్రమ్‌’ అనే ఓ వెబ్‌ సిరీస్‌లో నటించడానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇందులో బాలీవుడ్ న‌టి కొల్కి కొచ్లిన్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, సంజయ్‌ సూరి, ఓంకార్‌ కపూర్, ఐజాజ్‌ ఖాన్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ వెబ్ సిరీస్ చిత్రీక‌ర‌ణ‌ని మొద‌లు పెట్ట‌గా, సిమ్లాలోనే ఎక్కువ శాతం షూటింగ్‌ని జ‌ర‌ప‌నున్న‌ట్టు తెలుస్తుంది . భూమిక ఈ మ‌ధ్య స‌పోర్టింగ్ క్యారెక్టర్స్‌లో న‌టిస్తూ అభిమానుల ఆద‌ర‌ణ‌ని పొందుతుంది.

956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles