స‌మ‌స్య‌ల‌లో బిగ్ బీ కోలీవుడ్ చిత్రం..!

Sun,May 19, 2019 07:26 AM
big b Kollywood debut come out of troubles

బాలీవుడ్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ ఉయర్నత మనిథన్ అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. తమిళ్‌వానన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో న‌టుడు, ద‌ర్శ‌కుడు ఎస్‌జే సూర్య కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. త‌మిళం, హిందీ భాష‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవ‌ల సెట్స్ పైకి వెళ్లింది. చిత్ర ఫ‌స్ట్ లుక్ ర‌జ‌నీకాంత్ చేతుల మీదుగా విడుద‌లైంది. ఈ చిత్రంలో అమితాబ్ స‌ర‌స‌న రమ్య‌కృష్ణ న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈమె పాత్ర కూడా చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుంద‌ని అన్నారు. అయితే ఈ చిత్రం కొద్ది రోజులుగా వార్త‌ల‌లో నిలుస్తుంది. చిత్రంలో త‌న పాత్ర‌ని మ‌ల‌చిన విధానం బిగ్ బీకి న‌చ్చ‌క పోవ‌డంతో బిగ్ బీ, చిత్ర నిర్మాత‌ల‌కి మ‌ధ్య మ‌నస్ప‌ర్థ‌లు త‌లెత్తాయ‌ని, దీని వ‌ల‌న చిత్రం ఆగింద‌ని అంటున్నారు. ఎస్‌జే సూర్య న‌టించిన మాన్‌స్ట‌ర్ చిత్రం రిలీజ్ తర్వాత ఈ సమ‌స్య‌ల‌న్నింటిని సాల్వ్ చేసి ఓ కొలిక్కి తెస్తామ‌ని సూర్య అంటున్నాడు. అయితే ప్ర‌స్తుతం ఉన్న‌ స‌మ‌స్య‌ల‌న్ని చ‌క్క‌బ‌డి మ‌ళ్ళీ చిత్ర షూటింగ్ మొద‌లు కావాల‌ని, త‌మిళ చిత్రంలో అమితాబ్‌ని చూడాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

784
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles