మల్లూవుడ్ లో పట్టాలెక్కనున్న భారీ ప్రాజెక్ట్

Tue,April 4, 2017 10:24 AM

పిండికొద్దీ రొట్టె అని ఓ సామెత ఉంది. ఎంత చెట్టుకంత గాలి... ఉన్నంతలోనే సర్దుకోవాలి అని కూడా అంటారు. సినిమా భాషలో అయితే మార్కెట్ ను బట్టే సినిమా అంటారు. ఆ కోణంలో చూస్తే బాలీవుడ్, టాలీవుడ్ లకు భారీ మార్కెట్ ఉంది. ఒక్కో భారీ మూవీ బిజెనెస్ వందల కోట్లలోనే నడుస్తోంది. ఇప్పుడు మలయాళీ ఫీల్డ్ లో కూడా ఆ సాహసం చేయబోతున్నారు.


ఏదైనా సినిమా తీసే ముందు మన మార్కెట్ ఎంత అనేది ఆలోచిస్తున్నారు. ఏ భాషలో అయినా అలా ఆలోచించే మూవీస్ తీస్తున్నారు. మన టాలీవుడ్ లో కూడా బిగ్ స్టార్స్ మూవీస్ కు రెండు తెలుగు స్టేట్స్ లోనూ, ఓవర్సీస్ లోనూ మంచి మార్కెట్ ఉంది. వందల కోట్లలోనే కలెక్షన్స్ వస్తున్నాయి. ఇంక బాలీవుడ్ సంగతి చెప్పక్కర్లేదు. ఖాన్ ట్రియో మూవీస్ కైతే అదిరే బిజినెస్ అవుతోంది.

మన దక్షిణాదిన తక్కువ మార్కెట్ మల్లువుడ్ దే. అక్కడ 50 కోట్ల సినిమా అంటే మహా బిగ్ మూవీ కింద లెక్క. ఎందుకంటే మలయాళీ భాషా చిత్రాలు దేశంలో ఇతర ప్రాంతాల్లో ప్రదర్శించేది తక్కువ. అలాగే డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడమూ తక్కువే. వేరే భాషలోకి రీమేక్స్ కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. అలాంటిది ఆ భాషలో 600 కోట్లతో ఓ పిక్చర్ తీయబోతున్నారట.

మలయాళంలో ఓ పిక్చర్ 600 కోట్లతో తీయబోతున్నారట. ఈ మూవీకి ఏర్పాట్లు జరుగుతున్నాయట. ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. మహాభారతాన్ని మరో కోణంలో చూపిస్తూ వచ్చిన ఓ పుస్తకంలోని కాన్సెప్ట్ తో ఈ మూవీని తీయబోతున్నారట. వేరే భాషల్లో కూడా రాబోయే ఈ సినిమాలో ప్రముఖ మలయాళీ స్టార్ మోహన్ లాల్ భీముడుగా వేస్తాడట. ఇక బిగ్ బీ అమితాబ్ భీష్ముడిగా నటిస్తాడని, వేరే పాత్రలకు తెలుగు, తమిళ, కన్నడ నటీనటుల్ని తీసుకుంటారని తెలుస్తోంది. మరి ఈ మేటర్ పై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

1101
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles