తెలుగు బిగ్ బాస్ షోని నిలిపివేయాలని డిమాండ్

Sat,July 22, 2017 03:29 PM
BIGBOSS TELUGU is in trouble

తెలుగు చిత్ర పరిశ్రమలోని మొట్టమొదటి రియాలిటీ షో బిగ్ బాస్. ఇందులో పార్టిసిపెంట్స్ మొత్తం సినీ రంగానికి సంబంధించిన వారే కావడం గమనార్హం. అయితే ఈ షో మొత్తం 70 రోజుల ప్రక్రియ కాగా ఇందులో మొత్తం 14 మంది పాల్గొన్నారు.ఇంతవరకు బాగుంది కాని ఈ షోలో కార్యక్రమాలలో భాగంగాహోమగుండం వద్ద బ్రష్‌ చేసుకుంటూ చలి మంటలు కాచుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయని, అందులో ఆజ్యం పోస్తుండటం వంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు వివాదానికి దారితీసాయి. దీంతో బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి.ఈ షో నిర్వాహకులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ రియాలిటీ షోలో హైందవ సంస్కృతిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి.తమిళంలో కూడా ఈషోని నిలిపివేయాలని డిమాండ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మొద‌ట్లోనే ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షో కాంట్ర‌వ‌ర్సీగా మార‌గా, రానున్న రోజుల‌లో ఇంకెన్ని కొత్త స‌మస్య‌లు వ‌స్తాయో అని అందరు చ‌ర్చించుకుంటున్నారు.

7233
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles