బిగ్‌బాస్ ప్రోమోలో క‌నిపించిన హోస్ట్..!

Fri,June 21, 2019 10:43 AM
bigg boss 3 promo gives small hint

ఈ సారి సరికొత్త‌గా బిగ్ బాస్ రియాలిటీ షోని ప్రారంభించాల‌ని నిర్వాహ‌కులు తెగ స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు ప్రోమోలు సిద్ధం చేసుకున్న టీం ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తూ ఉంది. తాజాగా బిగ్ బాస్ 3 సీజ‌న్‌కి సంబంధించి మ‌రో ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో ఓ క‌థ చెప్తున్న‌ట్టుగా చూపిస్తూ మ‌ధ్య‌లో ఓ వ్యక్తిని ఫేస్ రివీల్ కాకుండా చూపించారు. ఆయ‌న లుక్‌, న‌డ‌క తీరుని బ‌ట్టి ఆ వ్యక్తి నాగార్జున‌నే అని, ఆయ‌నే ఈ కార్య‌క్ర‌మానికి హోస్ట్ అని తేల్చేశారు నెటిజ‌న్స్. మొత్తానికి మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అనే కార్య‌క్ర‌మంతో బుల్లితెర‌పై సంచ‌ల‌నం సృష్టించిన నాగ్ ఈ సారి బిగ్ బాస్ 3 తో ప్రేక్ష‌కులని మ‌రింత‌గా అల‌రించ‌నున్నారు. జూలైలో బిగ్ బాస్ 3 కార్య‌క్ర‌మం మొద‌లు కానుండ‌గా, ఇందులో పాల్గొనే కంటెస్టంట్స్ ఎవ‌రు అనే దానిపై స‌స్పెన్స్ నెల‌కొంది. సీజన్ 1ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా, సీజ‌న్ 2కి నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం విదిత‌మే.3651
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles