బిగ్ బాస్ 3 ఎప్పుడు ప్రారంభం కానుందో తెలుసా ?

Fri,June 28, 2019 08:43 AM
Bigg Boss 3 starts on july 21

బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం నార్త్‌లో సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. సౌత్‌లోను ఈ కార్య‌క్ర‌మం వ‌రుస సీజ‌న్‌లు జ‌రుపుకుంటుండ‌గా, తెలుగులో సీజ‌న్ 3 జ‌రుపుకునేందుకు సిద్ధ‌మైంది. నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న ఈ కార్య‌క్ర‌మంలో 16 మంది కంటెస్టెంట్‌లు ఉంటార‌ని తెలుస్తుంది. వారెవ‌ర‌నేది అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయిన వారికి సంబంధించిన లిస్ట్ మాత్రం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇక ఈ కార్య‌క్ర‌మం ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా అని ఎదురు చూసే ఫ్యాన్స్‌కి ఈ వార్త ఆనందాన్ని ఇస్తుంద‌నే చెప్పాలి. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 3ని జులై 21 నుంచి టెలికాస్ట్ చేయడం ప్రారంభిస్తారట. ఎంతో వినోదాత్మ‌కంగా ఉండేలా ఈ షోని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుండ‌గా, బిగ్ బాస్ సెట్‌ని ఎక్క‌డ నిర్మిస్తున్నారో తెలియాల్సి ఉంది. త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 3 ఇటీవ‌లే ప్రారంభమైన విష‌యం తెలిసిందే.

4119
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles