రోహిణి ఔట్..శివ జ్యోతి భావోద్వేగం

Mon,August 19, 2019 10:41 AM
Bigg Boss 3 Telugu 4th Week   Rohini Eliminated

బిగ్ బాస్ నాలుగో వారం ఎలిమినేషన్‌ నామినేషన్స్‌లో బాబా భాస్కర్, శ్రీముఖి, శివ జ్యోతి, వరుణ్ సందేశ్, రోహిణి, రవి, రాహుల్‌‌ ఉండగా అందరూ ఊహించినట్లే రోహిణి ఎలిమినేట్‌ అయింది. ఐతే ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న హౌస్‌మేట్స్‌ లో రోహిణి కాస్త తక్కువ ఫేమ్‌ కావడంతో ఆమె బిగ్‌బాస్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. హౌస్‌లో ఎవరితోనూ గొడవలు లేకపోవడం, అందరినీ కలుపుకొని పోవడం, ఎక్కువగా టాస్కుల్లో, కాంట్రవర్సీలతో హైలెట్‌ కాకపోవడంతో ప్రేక్షకులు ఆమెపై ఆదరణ చూపించలేకపోయారు. దీంతో నామినేషన్స్‌లోకి వచ్చిన తొలిసారే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. రోహిణి నామినేషన్‌కు తానే కారణమని భావించిన శివజ్యోతి రోహిణి ఎలిమినేట్ కావడంతో వెక్కివెక్కి ఏడ్చింది.

ఇక ఈ సండే నిజంగానే ఫన్‌డే అయింది. డైలాగ్‌లు, వాదోపవాదాలు, మాటలతో బిగ్‌బాస్‌ హౌస్‌ మార్మోగిపోయింది. ముందుగా నాగార్జున ఎలిమినేషన్‌లో ఉన్న ఐదుగురు మాస్క్‌ తీసి వ్యవహరిస్తున్నారో లేదో తెలుసుకునేందుకు హౌస్‌మేట్స్‌కు సరదా టాస్క్ ఇచ్చారు. ఇక హౌస్ మేట్స్ ఎంతవరకూ ఓపెన్‌గా(మాస్క్‌ తీసి ) ఉంటున్నారో తెలుసుకునేందుకు బిగ్ బాస్ హౌస్‌ని కోర్టులా మార్చేశారు. దీని కోసం ప్రాసిక్యూట్‌, జడ్జ్‌లు, నిందితులుగా ప్రత్యేక టీమ్‌లుగా విడదీశారు. ఒక పేరు చెప్పి వాళ్లు హౌస్‌లో ఎందుకు ఉండకూడదో కారణాలు చెప్పాలని అందుకు లాయర్లు వాదనలు వినిపించాలని నాగార్జున సూచించారు. ఇలా లాయర్లు, నిందితులు, జడ్జిల మధ్య ఆసక్తికర వాదనలు, సంభాషణలు జరిగాయి. టాస్క్ ఆద్యంతం అందరినీ అలరించింది.

మొత్తంగా ఈ గేమ్ తర్వాత ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న ఐదుగురిలో శ్రీముఖి, రోహిణి, బాబా భాస్కర్, రవి, రాహుల్‌‌లలో రోహిణి ఎలిమినేట్ అయింది. నామినేషన్‌ ప్రక్రియ గురించి చర్చించడం ద్వారా నియమాన్ని ఉల్లంఘించినందుకు బిగ్‌బాస్‌.. రోహిణిని నేరుగా నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. శివజ్యోతి సేఫ్ అయినట్టు నాగార్జున శనివారమే ప్రకటించాడు. ఆదివారం షోలో ఒక్కొక్కరిని సేఫ్ చేస్తూ వచ్చిన నాగ్ చివరకు రోహిణి, రాహుల్ నామినేషన్‌కు తీసుకొచ్చారు. చివరకు రోహిణి ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించాడు. రోహిణి ఎలిమినేట్ కావడానికి తాను కారణమని శివ జ్యోతి భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమైంది.

హౌస్ నుంచి బయటకు వచ్చిన రోహిణి..హౌస్‌మేట్స్‌ అందరికీ మార్కులు వేసింది. అలీకి 100కు వంద మార్కులు వేయగా.. భాస్కర్‌కు వందకు 1000 మార్కులు వేసి ఆశ్చర్యపరిచింది. శ్రీముఖి బయట అందరితో సరదాగా ఉన్నట్లు హౌస్‌లో అలా ఉండటం లేదని.. ఎప్పుడూ ఆట గురించే ఆలోచిస్తూ ఉంటుందని చెప్పింది. ఇక మహేశ్ గొడవలు పెంచడానికి ప్రయత్నిస్తాడని వ్యాఖ్యానించింది. మహేష్‌, శ్రీముఖికి చెరో 50 మార్కులు వేయగా రవి కృష్ణకు 95, అషూకు 99 మార్కులు వేసింది. మొత్తంగా నాలుగో వారం ఎలిమినేషన్‌లో రోహిణి బయటకు వెళ్లిపోవడంతో హౌస్‌లో 12 మంది మాత్రమే మిగిలారు.

2810
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles