బాబాకి స్పెష‌ల్ ప‌వ‌ర్.. నామినేష‌న్ నుండి బ‌య‌ట‌ప‌డ్డ మంచోడు

Tue,September 10, 2019 08:23 AM
Bigg Boss sets the stage for yet another open nominations.

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3 ఆదివారం ఎపిసోడ్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా 50 రోజులు( ఏడు వారాలు) పూర్తి చేసుకుంది. ఆదివారం రోజు నాని బిగ్ బాస్ వేదిక‌పైకి వ‌చ్చి సంద‌డి చేశాడు. ఏడోవారంలో ఎవ‌రు ఊహించ‌ని విధంగా అలీ రెజా ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ళాడు. దీంతో ప్ర‌తి ఒక్క‌రు క‌న్నీళ్లు పెట్టుకున్నారు. వారి బాధ‌ని ఆప‌డం ఎవ‌రిత‌రం కాలేదు. ప్ర‌స్తుతం ఇంట్లో ప‌దకొండు మంది స‌భ్యులు ఉన్నారు. వీరిలో ఈ వారం ఒక‌రు ఎలిమినేట్ కానున్నారు.

సోమ‌వారం జ‌రిగిన 51వ ఎపిసోడ్‌లో బాబా భాస్క‌ర్ క‌న్నీరు పెట్టుకున్నారు. మ‌హేష్‌ని త‌ప్పుగా అర్ధం చేసుకున్నాన‌ని తెగ ఫీల‌య్యారు. ఆ త‌ర్వాత అలీ రెజా ఇంటి నుండి వెళ్లిపపోయాడ‌ని త‌లుచుకొని మరీ ఏడుస్తున్నారు శివ‌జ్యోతి, ర‌వికృష్ణ‌. ఈ క్ర‌మంలో శ్రీముఖి వాడేమి చ‌చ్చిపోలేదు. సంతాప స‌భ‌లు పెట్టుకోవ‌డానికి అని ఫైర్ అయింది. ఇక బిగ్ బాస్ .. శివ‌జ్యోతి, హిమ‌జ‌ల‌కి ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా శివ‌జ్యోతి రిపోర్ట‌ర్‌గా, హిమ‌జ కెమెరామెన్‌గా ఉండాల‌ని సూచిస్తూ వారిద్ద‌రు త‌మ‌కిచ్చిన ఫోన్‌లో అద్భుత స‌న్నివేశాలు చిత్రీక‌రించాల‌ని తెలిపారు.

శివ‌జ్యోతి, హిమ‌జలు ఫోన్ ప‌ట్టుకొని ఇల్లు మొత్తం తిరుగుతూ ఇంటి స‌భ్యుల మూమెంట్స్‌ని త‌మ కెమెరాలో బంధించారు. ఆ త‌ర్వాత హౌస్‌లో ఉన్న 11 మంది కంటెస్టెంట్స్‌లో ఒకర్ని బిగ్ బాస్ హౌస్‌ నుండి పంపేందుకు బిగ్ బాస్ ఎలిమినేషన్స్ ద్వాారా డేంజర్ బెల్స్ మోగించారు. ఈవారం ఎలిమినేషన్‌లో భాగంగా హౌస్‌లో ఉన్న 11 మందిని రెండు గ్రూపులుగా విడగొట్టారు బిగ్ బాస్. అయితే హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న బాబా భాస్కర్‌కి మినహాయింపు ఇచ్చారు.

గ్రూప్ 1లో రాహుల్, వరుణ్, వితికా, శిల్ప, పునర్నవిలు ఉండగా.. గ్రూప్‌ 2లో రవి, శివజ్యోతి, శ్రీముఖి, మహేష్, హిమజలు ఉన్నారు. ఒక్కో గ్రూప్‌ వాళ్లు.. తమ ఆపోజిట్ గ్రూప్‌లో ఉన్న ఇద్దరి ఫొటోలను తీసుకుని మంటల్లో కాల్చి ఆ త‌ర్వాత వారికి తిల‌కం పెట్టి నామినేట్ చేయడానికి సరైన రీజన్ చెప్పాలని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. దీంతో ముందుగా రంగంలోకి దిగిన ర‌వికృష్ణ .. రాహుల్, శిల్పల‌ని నామినేట్ చేశాడు. ఆ త‌ర్వాత పునర్నవి.. (మహేష్, శ్రీముఖి), శివజ్యోతి.. (పునర్నవి, శిల్ప), శిల్ప చక్రవర్తి.. (జ్యోతి, హిమజ), శ్రీముఖి.. (పునర్నవి, శిల్ప), వితిక.. (రవి, రాహుల్), హిమజ.. (శిల్ప, వితిక), వరుణ్.. (మహేష్, హిమజ), మహేష్.. (పునర్నవి, వరుణ్ సందేశ్), రాహుల్.. (శ్రీముఖి, రవి)లని నామినేట్ చేశాడు.

ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఎక్కువ ఓట్స్ వ‌చ్చిన శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, రవి, శ్రీముఖిలు నామినేట్ అయిన‌ట్టు బిగ్ బాస్ తెలిపారు. అయితే ఇక్క‌డ ఓ ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. కెప్టెన్ హోదాలో ఉన్న బాబా భాస్కర్ ప్ర‌త్యేక అధికారం ఉప‌యోగించి ఒక‌రిని సేవ్ చేయాల‌ని కోరారు. దాంతో ఎక్కువ సేపు ఆలోచించ‌కుండానే ర‌వికృష్ణ‌ని సేవ్ చేస్తున్న‌ట్టు బిగ్ బాస్‌కి తెలిపారు బాబా. తాను గేమ్‌లో చాలా క‌సిగా పాల్గొన్నాడ‌ని, అది త‌న క‌ళ్ళ‌ల్లో క‌నిపించింద‌ని బాబా భాస్కర్ తెలిపారు. దీంతో ఈ వారం శిల్ప చక్రవర్తి, పునర్నవి, మహేష్, హిమజ, శ్రీముఖి ల‌లో ఒక‌రు ఇంటి నుండి వెళ్ళ‌నున్నారు.

2172
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles