ఓట‌ర్ లిస్ట్‌లో దీపికా పేరుతో కాజ‌ల్ ఫోటో

Sat,March 23, 2019 08:59 AM
blunder mistake in voter list

ఓట‌ర్ జాబితా లిస్ట్‌లో సినీ తారల ఫోటోలు ప్ర‌త్యక్షం కావ‌డం లేదంటే ఒక‌రి పేరుతో మ‌రొక‌రి ఫోటో ప్ర‌త్య‌క్షం కావ‌డం మ‌నం గ‌తంలో చాలానే చూసాం. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌న మ‌రొక‌టి జ‌రిగింది. ఇది ఎన్నిక‌ల అధికారుల నిర్ల‌క్ష్యానికి అద్దం ప‌ట్టేలా ఉంది. వివ‌రాల‌లోకి వెళితే రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో దీపికా ప‌దుకొణే పేరుతో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫోటో ప్ర‌త్య‌క్షం అయింది. దీపికా ప‌దుకొణే తండ్రి పేరు ర‌మేష్ కొండా అని ఆమె వ‌య‌స్సు 22 అని ప్రింట్ చేశారు. ఇంటి పేరు కూడా ఆ లిస్ట్ లో ముద్రించ‌డంతో ఎన్నిక‌ల అధికార్లు ఎంత సక్ర‌మంగా ప‌నులు చేస్తున్నారో అర్ధ‌మ‌వుతుంది అని ఓట‌ర్లు మండిప‌డుతున్నారు. ప్ర‌స్తుతం దీపికా పేరుతో ఉన్న కాజ‌ల్ ఫోటోకి సంబంధించిన ప‌త్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీనిపై నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ఫొటోతో పద్మావతి అనే మహిళకు ఓటు హక్కు ఇచ్చిన విష‌యం విదిత‌మే.

4570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles