ర‌వితేజ‌కి ప్ర‌తినాయ‌కుడిగా త‌మిళ స్టార్

Sat,November 3, 2018 08:15 AM

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని న‌వంబ‌ర్ 16న విడుద‌ల కానుండ‌గా, త్వ‌ర‌లో మ‌రో ప్రాజెక్ట్ మొద‌లు పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాల ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ సినిమా ఉండ‌నుండ‌గా, ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. ఈ మూవీకి ‘డిస్కో రాజా’ టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ట‌! ఇందులో ముగ్గురు కథానాయికలకు చోటుండ‌గా ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా ఎంపిక చేశారు. మరో నాయికను త్వరలో ఎంపిక చేయనున్నారు. సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త. అయితే ఈ చిత్రం కొంత భాగం చెన్నై నేప‌థ్యంలో సాగనున్న‌నేప‌థ్యంలో త‌మిళ స్టార్ బాబీ సింహాని ప్ర‌తి నాయ‌కుడిగా ఎంపిక చేశార‌ట‌. ప‌లు తెలుగు సినిమాల‌లో న‌టించిన బాబీ సింహా రీసెంట్‌గా సామి స్క్వేర్‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించాడు. మ‌రి మాస్ మహ‌రాజా, త‌మిళ స్టార్ ల మ‌ధ్య ప్ర‌తిఘ‌ట‌న ఎలా ఉంటుందో చూడాలి.

2942
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles