వీడియో.. బాలీవుడ్ నటికి విమానంలో వేధింపులు

Sun,December 10, 2017 09:26 AM
Bollywood actress Zaira Wasim allegedly molested on board

విమానాల్లో వేధింపులు ఈ మధ్య సాధారణంగా మారిపోయాయి. సెలబ్రిటీలకు కూడా ఇవి తప్పడం లేదు. తాజాగా దంగల్‌లాంటి హిట్ మూవీలో నటించిన జైరా వసీమ్‌ను కూడా సహచర ప్రయాణికుడు వేధించాడు. ఈ విషయాన్ని ఆమెనే వెల్లడించింది. ఢిల్లీ నుంచి ముంబైకి విస్తారా ఫ్లైట్‌లో వస్తుండగా తన పక్కనే ఉన్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించినట్లు జైరా చెప్పింది. సోషల్ మీడియా ద్వారా ఆమె ఈ విషయం చెప్పడంతో సంబంధిత ఎయిర్‌లైన్స్ వెంటనే స్పందించి విచారణ మొదలుపెట్టింది. తమ ఎయిర్‌లైన్స్‌లో ఇలాంటి ప్రవర్తనను తాము సహించబోమని, ఈ విషయంలో జైరాకు అన్ని విధాలుగా అండగా ఉంటామని విస్తారా స్పష్టంచేసింది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ నటించిన దంగల్ మూవీతో బాలీవుడ్ తెరంగేట్రం చేసింది జైరా వసీమ్.

3459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles