మాల్దీవుల్లో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి.. ఫోటోలు వైరల్!

Tue,February 6, 2018 06:09 PM
Bollywood beauty Parineeti Chopra Maldives photos goes viral

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ప్రస్తుతం మాల్దీవుల్లో తన వెకేషన్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నది. ఈ సంవత్సరం సినిమాల్లో బిజీ బిజీగా గడపనున్న ఈ భామ ప్రస్తుతం తనకు దొరికిన ఈ టైమ్‌లో మాల్దీవులకు చెక్కేసింది. ఇక.. మాల్దీవుల్లో ఫోటోలకు పోజులిస్తూ.. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేస్తున్నది ఈ సుందరి.


పరిణీతి ప్రస్తుతం తన 'ఇషాక్ జాదే' సినిమా కోస్టార్ అర్జున్ కపూర్‌తో 'సందీప్ ఔర్ పింకీ ఫరార్' సినిమాలో నటిస్తున్నది. ఆ సినిమాకు సంబంధించి పరిణీతి, అర్జున్ ఫస్ట్ లుక్ కూడా గతంలోనే రిలీజ్ అయింది. పరిణీతి దాంతో పాటు అక్షయ్ కుమార్‌తో 'నమస్తే కెనడా' సినిమాలో నటిస్తున్నది. ఆ సినిమా అక్షయ్ నటించిన 'నమస్తే లండన్‌'కు సీక్వెల్. అక్షయ్‌తో 'కేసరి' అనే మరో సినిమాలోనూ పరిణీతి నటిస్తుంది. దీంతో ఈ సంవత్సరం పరిణీతి కాస్త బిజీ బిజీగానే గడపనుంది.
3592
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles