మ‌హ‌ర్షిపై క‌న్నేసిన బాలీవుడ్ స్టార్ హీరో

Sun,May 19, 2019 07:17 AM
Bollywood Star Hero In Plans To Remake Mahesh maharshi

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన చిత్రం మ‌హ‌ర్షి. మంచి మెసేజ్‌తో రూపొందిన ఈ చిత్రం ప్ర‌స్తుతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ క‌లెక్షన్స్ రాబ‌డుతుంది. 200 కోట్ల రూపాయ‌లు రాబ‌ట్టే దిశ‌గా ప‌రుగులు పెడుతుంది. అయితే ఇంత మంచి విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ రీమేక్ చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే రీమేక్‌కి సంబంధించి ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్టు కూడా తెలుస్తుంది. స‌ల్మాన్‌, ప్ర‌భుదేవా కోసం ఈ సినిమా ప్ర‌త్యేక షో ప్ర‌ద‌ర్శించ‌గా, ఇది స‌ల్మాన్‌కి క‌నెక్ట్ అయితే రీమేక్ చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. స‌ల్మాన్ గతంలో మహేశ్‌బాబు ‘పోకిరి’ ని హిందీ లో ‘వాంటెడ్‌’ పేరుతో రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. మ‌హ‌ర్షి హిందీ రీమేక్‌కి సంబంధించి త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది

2901
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles