ఆర్ఆర్ఆర్‌లో బాలీవుడ్ న‌టీన‌టులు..!

Tue,February 12, 2019 11:19 AM

త‌న ప్రతి సినిమాతో సంచ‌ల‌నాలు సృష్టించే రాజ‌మౌళి ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రామ రావ‌ణ రాజ్యం అనే టైటిల్‌ని చిత్రానికి ప‌రిశీలిస్తున్నార‌ని టాక్స్ వినిపిస్తుండ‌గా, ఈ మూవీని వ‌చ్చే ఏడాది సమ్మ‌ర్‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంకి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు ప్రేక్ష‌కుల‌లో సినిమాపై మ‌రింత ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి.


తాజాగా ఈ చిత్రంలో అలియా భ‌ట్ , ప‌రిణితి చోప్రా అనే ఇద్ద‌రు బాలీవుడ్ భామ‌లు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారనే వార్త దావానంలా పాకింది. అంతేకాదు బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఏమైన స్పందిస్తుందేమో చూడాలి. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డివివి ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నాడు. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2020లో తెలుగు తో పాటు హిందీ , తమిళ , మలయాళ భాషల్లో విడుదలకానుంది. కీరవాణి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని .. చిత్రంలో చరణ్ కు బాబాయ్ గా నటించనున్నాడని అంటున్నారు.

2413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles