యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌తో కొచ్చి ఎయిర్ పోర్ట్‌లో..

Fri,April 19, 2019 01:05 PM
brahmaji with action director

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్ .. నరసింహారెడ్డి రాజగురువు గోసాయి వెంకన్న పాత్రలో క‌నిపించ‌నున్నారు. విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఆంగ్లేయులను ఎదిరించిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని భాషల అగ్రనటులు చిత్రంలో భాగం కావడంతో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం కేరళలోని చాలకూడిలో సైరా మూవీ చిత్రీకరణ జరుగుతున్నది. చిరంజీవి, జగపతిబాబు పాత్రలపై కీలక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పోరాటయోధుడు వీరారెడ్డిగా జగపతిబాబు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. సీనియ‌ర్ న‌టుడు బ్ర‌హ్మాజీ కూడా చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. తాజాగా బ్ర‌హ్మాజీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డితో సెల్ఫీ దిగి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. కొచ్చి, సైరా, ఎయిర్ పోర్ట్ అనే హ్యాష్ ట్యాగ్‌ల‌ని పోస్ట్‌కి త‌గిలించాడు. మే నెలాఖరులోగా చిత్రీకరణ పూర్తిచేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. అమిత్‌త్రివేది స్వరకర్త. ద‌స‌రా కానుక‌గా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌ని మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.


1207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles