ఆకాశంలో బ్ర‌హ్మాస్త్రా లోగో ఆవిష్క‌ర‌ణ ఎలా జ‌రిగిందంటే.. వీడియో

Fri,April 5, 2019 11:59 AM
Brahmastra  kumbh  Behind the scenes

బాలీవుడ్‌లో అత్యంత బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న భారీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం బ్ర‌హ్మాస్త్రా. ఈ చిత్రం తొలి భాగం క్రిస్మ‌స్ కానుక‌గా విడుదల కానుండ‌గా, ఈ సినిమా లోగోని ఇటీవ‌ల‌ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌యాగ కుంభ‌మేళాలో వినూత్నంగా విడుద‌ల చేశారు. ఈ లోగో విడుద‌ల కార్య‌క్ర‌మం కోసం ర‌ణ‌భీర్ కపూర్‌, అలియా భ‌ట్‌, ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ ప్ర‌యాగ‌కు వెళ్లారు. హీరోయిన్ అలియా భ‌ట్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లైవ్‌లో ప్రోగ్రాం వివ‌రాల‌ను తెలియ‌జేశారు. 150 డ్రోన్ కెమెరాల స‌హాయంతో బ్ర‌హ్మాస్త్ర అనే లోగోను ఆకాశంలో ఆవిష్క‌రించడం విశేషం. ఇలా డ్రోన్స్ స‌హాయంతో ఆకాశంలో లోగోను ఆవిష్క‌రించ‌డం సినిమా చరిత్ర‌లో ఇదే మొద‌టిసారి. అయితే ఈ అద్బుత ఆవిష్క‌ర‌ణ ఎలా జ‌రిగిందో వీడియో ద్వారా చూపించారు.

అలియా భ‌ట్‌, ర‌ణ‌బీర్ క‌పూర్ , అయాన్ ముఖ‌ర్జీ లోగో లాంచ్ ఎక్స్‌పీరియెన్స్‌ని వీడియోలో చెప్పారు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు స‌రిగ్గా లేక‌పోయిన కూడా టీం అంతా లోగోని ఘ‌నంగా ఆవిష్క‌రించారు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌పై క‌ర‌ణ్ జోహార్ అత్యంత బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. శివ పాత్ర‌లో ర‌ణ్‌బీర్ న‌టిస్తుండ‌గా, ఇషా పాత్ర‌లో అలియా క‌నువిందు చేయ‌నుంది. మూడు భాగాలుగా ఈ ఫాంట‌సీ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌, నాగార్జున అక్కినేని, అలియా భ‌ట్‌, మౌనీ రాయ్ ముఖ్య పాత్ర‌ల‌లో ఈ సినిమా తెర‌కెక్కుతుంది..

1728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles