బ్రోచెవారెవ‌రురా చిత్ర టీజ‌ర్ విడుద‌ల‌

Sat,April 20, 2019 12:35 PM

కెరీర్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న న‌టుడు శ్రీ విష్ణు. నీది నాదీ ఒకే క‌థ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్న శ్రీ విష్ణు బ్రోచేవారెవ‌రురా అనే చిత్రం చేస్తున్నాడు. మెంట‌ల్ మ‌దిలో వంటి చిత్రాన్ని తెర‌కెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా ఇందులో నివేదా థామస్ .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా న‌టిస్తున్నారు. సత్యదేవ్ .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రం విడుద‌ల కానుంది. మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కుమార్ మ‌న్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి చ‌ల‌న‌మే చిత్ర‌ము.. చిత్ర‌మే చ‌ల‌న‌ము.. అనేది ట్యాగ్ లైన్‌. తాజాగా చిత్ర బృందం టీజ‌ర్ విడుద‌ల చేసింది. ఇందులో స‌న్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. శ్రీ విష్ణు ఈ చిత్రంతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకోవ‌డం ఖాయమ‌ని అంటున్నారు. వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ దశలో ఉంది. మే నెల‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. శ్రీ విష్ణు తిప్ప‌రామీసం అనే చిత్రం కూడా చేస్తున్నాడు.

937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles