క్వ‌శ్చ‌న్ పేపర్స్ దొబ్బేయడం అంత ఈజీ కాదు

Fri,July 12, 2019 08:54 AM

నీది నాదీ ఒకే క‌థ చిత్రంతో అంద‌రి దృష్టిలో ప‌డ్డ కుర్ర హీరో శ్రీ విష్ణు. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం బ్రోచేవారెవ‌రురా. మెంట‌ల్ మ‌దిలో వంటి చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, ఇందులో నివేదా థామస్ .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా న‌టించారు. సత్యదేవ్ .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కుమార్ మ‌న్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకుంది. న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్‌తో పాటు కామెడీ, క‌థ‌, క‌థ‌నం సినిమా మంచి విజ‌యం సాధించ‌డంలో భాగ‌మ‌య్యాయి. విమ‌ర్శ‌కులు ఈ సినిమాపై ప్రశంస‌లు కురిపిస్తున్నారు. విక్ట‌రీ వెంక‌టేష్‌కి కూడా ఈ చిత్రం బాగా న‌చ్చ‌డంతో శ్రీ విష్ణుకి కాల్ చేసి అభినందించార‌ట‌. ప్ర‌స్తుతం ఈ చిత్రం మంచి టాక్‌తో న‌డుస్తుండ‌గా, సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచేందుకు మేక‌ర్స్ సినిమా నుండి తొల‌గించిన ప‌లు స‌న్నివేశాల‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు. తాజాగా విడుద‌లైన డిలీటెడ్ సీన్‌లో ప‌రీక్షా ప‌త్రాల‌ని దొంగిలించేందుకు ప్లాన్ చేస్తుండ‌గా, క్వ‌శ్చ‌న్ పేపర్స్ దొబ్బేయడం అంత ఈజీ కాదు అని శ్రీ విష్ణు చెబుతాడు. కాని దొంగిలించి చూపిస్తుంది చిత్ర క‌థానాయిక‌. ఈ సీన్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

1166
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles