తేజూ కోసం బ‌న్నీ త్యాగం చేశాడా..!

Fri,December 28, 2018 10:10 AM
bunny sacrifice for sai dharm tej

మెగాస్టార్ చిరంజీవి వేసిన బాట‌లో వ‌డివ‌డిగా అడుగులు వేస్తూ స్టార్ స్టేట‌స్‌ని అందుకుంటున్నారు మెగా హీరోలు. పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన తేజూ కెరీర్ మొద‌ట్లో మంచి విజ‌యాలు అందుకున్నాడు. ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాపులు తేజూ కెరీర్‌ని సందిగ్థంలో ప‌డేశాయి. ప్ర‌స్తుతం ఓ మంచి హిట్ కోసం తేజూ ఎదురు చూస్తున్నాడు. ప్ర‌స్తుతం నేను శైల‌జ ఫేం కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో చిత్ర‌ల‌హ‌రి అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ త‌న‌కి మంచి విజ‌యం అందిస్తుంద‌ని భావిస్తున్నాడు.

ఇటీవ‌ల వ‌రుస హిట్స్ కొడుతున్న ప‌ర‌శురాం .. బ‌న్నీ కోసం మంచి క‌థ‌ని సిద్ధం చేశాడు. ఈ క‌థ బ‌న్నీకి నచ్చ‌డంతో త్వ‌ర‌లోనే చేద్ధామ‌ని మాట కూడా ఇచ్చాడ‌ట‌. కాని ప్ర‌స్తుతం హిట్స్ లేక ఇబ్బంది ప‌డుతున్న తేజూని దృష్టిలో పెట్టుకున్న బన్నీ త‌న‌కి చెప్పిన క‌థ‌తో సాయిధ‌ర‌మ్‌ని హీరోగా పెట్టి సినిమా చేయ‌మని ప‌రశురాంకి చెప్పాడ‌ట‌. మ‌రి ఇందులో నిజమెంత ఉందో తెలియ‌దు కాని ఈ వార్త బ‌న్నీ అభిమానుల‌లో ఆనందం నింపుతుంది.

2522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles