సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వేదిక‌, టైం ఫిక్స్

Wed,August 14, 2019 12:27 PM
celebrate Saaho with Saaho Pre Release Event

బాహుబ‌లి వంటి భారీ ప్రాజెక్ట్‌లో న‌టించిన ప్ర‌భాస్ ఇప్పుడు మ‌రో బ‌డా ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌తో సాహో చిత్రం తెర‌కెక్క‌గా, ఈ మూవీ ఆగ‌స్ట్ 30న తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, దీనికి ప్రేక్ష‌కుల నుండి భారీ స్పంద‌న వ‌చ్చింది. మ‌రి కొద్ది రోజుల‌లో చిత్రం విడుద‌ల కానున్న నేప‌థ్యంలో సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెంచేందుకు మేక‌ర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆగ‌స్ట్ 18 ఆదివారం సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నున్న‌ట్టు మేక‌ర్స్ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ మాదిరిగానే ఈ చిత్ర వేడుక‌ని కూడా భారీ రేంజ్‌లో జ‌రిపేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించింది. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, లాల్‌ వంటి టాప్ స్టార్స్‌ ప్రధాన పాత్రల్లో న‌టించారు. హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ చిత్రానికి పని చేయ‌డం విశేషం.



1564
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles