నోటా ద‌ర్శ‌కుడి పెళ్ళిలో సంద‌డి చేసిన టాప్ సెల‌బ్స్‌

Sat,July 13, 2019 01:25 PM
Celebrities At Director Anand Shankar marriage

తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ వద్ద అసిస్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించడం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు ఆనంద్ శంకర్. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత కలైపులి థాను రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ అరిమా నంబీ అనే సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొన్నది. ఈ సినిమా విజ‌యంతో విక్ర‌మ్‌తో ఇరు మురుగున్, విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో నోటా అనే బైలింగ్యువ‌ల్ చిత్రం చేశాడు ఆనంద్. అయితే దుబాయ్‌కి చెందిన దివ్యాంక అనే అమ్మాయితో కొన్నాళ్ళుగా ప్రేమాయ‌ణం న‌డిపిన ఆయ‌న జూలై 11న చెన్నైలో వివాహం చేసుకున్నాడు. ఈ ద‌ర్శ‌కుడి వివాహానికి మురుగ‌దాస్‌, స‌త్య‌రాజ్‌,క‌మెడీయ‌న్ తంబి రామ‌య్య‌, విక్ర‌మ్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు. తాజాగా పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆనంద్ శంకర్.. ప్రముఖ రంగస్థల కళాకారుడు కోమల్ స్వామినాథన్ మనువడు అనే విషయం తెలిసిందే.

2264
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles