వెరైటీ గెట‌ప్స్‌లో స్టార్ హీరోలు..ఘ‌నంగా జ‌రిగిన సంగీత్

Sun,December 30, 2018 10:16 AM
celebrities at SS Karthikeyas Wedding

దర్శకుడు ధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి జగపతిబాబు సోదరుడు రాం ప్రసాద్ కుమార్ కుమార్తె, గాయని పూజా ప్రసాద్‌తో నేటి సాయంత్రం రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో గల హోటల్ ఫెయిర్‌మౌంట్‌లో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌ర‌గ‌నున్న వీరి వివాహానికి ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌, రానా, నాని , నాగార్జున, రాఘ‌వేంద్ర‌రావు, అఖిల్ త‌దిత‌రులు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. వీరికి రాజ‌మౌళి ఘ‌న స్వాగతం ప‌ల‌క‌గా, ప్ర‌తి ఒక్క‌రు ఉత్సాహంగా ఆడిపాడారు. మ‌హిళ‌లు సంప్రదాయంగా చీర‌క‌ట్టులో మెర‌వ‌గా, మ‌న హీరోలు కుర్తా పైజామాలు ధరించి స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌, చెర్రీ, రానాకి సంబంధించిన ప‌లు ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. శనివారం రాత్రి కార్తికేయ‌, పూజాల సంగీత్ ఘనంగా జ‌ర‌గ‌గా ఆ వేడుక‌లో రానా, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో పాటు రాజ‌మౌళి చిందులేశారు. నాగ్ కూడా త‌న‌దైన స్టెప్పుల‌తో అల‌రించారు. సంగీత్‌కి సంబంధించిన వీడియోలు అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.2612
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles