పుల్వామా దాడిని తీవ్రంగా ఖండిస్తున్న సెల‌బ్రిటీలు

Fri,February 15, 2019 08:46 AM
celebrities express SHOCK and anger over the Pulwama terror attack

జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా గరిపొరా ప్రాంతంలో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్)తో ఆత్మాహుతి దాడికి తెగబడ్డ సంగ‌తి తెలిసిందే. ఈ ఉగ్ర‌దాడిలో 40కి పైగా ప్రాణాలు కోల్పోగా కొంద‌రు గాయ‌ప‌డ్డారు. ఈ దాడిని రాజ‌కీయాల‌కి అతీతంగా ప్ర‌తి ఒక్క‌రు ఖండించారు. ఉగ్రవాదాన్ని ఓడించడంలో అమెరికా కూడా భారత్‌కు అండగా ఉంటామ‌ని తెలిపింది. అయితే ఇంత‌టి దారుణ‌మైన చ‌ర్య‌ని సినిమా సెల‌బ్రిటీలు కూడా ఖండిస్తున్నారు.

దాడిలో సీఆర్పీఎఫ్ జ‌వాన్లు ప్రాణాలు కోల్పోవ‌డం మ‌న‌సుని క‌లచి వేసింది. మృతుల సంఖ్య పెరుగుతుండ‌డం బాధ‌ని క‌లిగిస్తుంది. అమరవీరులకు నా తరఫున, జనసైనికుల తరఫున సెల్యూట్ చేస్తున్నాను. వారి త్యాగాలను భారత జాతి ఎన్నటికీ మరవదు. అమరులైన ఆ జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను - ప‌వ‌న్ క‌ళ్యాణ్

మ‌న‌ల‌ని కంటికి రెప్ప‌లా కాపాడుతున్న జ‌వాన్లు ఉగ్రదాడిలో మ‌ర‌ణించడం మ‌న‌సుని క‌లచి వేసింది. ప్రాణాలు విడిచిన జ‌వాన్ల కుటుంబాల‌కి అండ‌గా నిల‌బ‌డ‌డం మ‌న ధ్యేయం- స‌ల్మాన్ ఖాన్

పుల్వామా ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా షాక్ అయ్యాను. ద్వేషం ఎప్ప‌టికి స‌మాధానం ఇవ్వ‌దు. ఉగ్ర‌దాడిలో గాయ‌ప‌డ్డ జ‌వాన్ల ఆత్మ‌కి శాంతి క‌లగాల‌ని, వారి కుటుంబాల‌కి ధైర్యం అందించాల‌ని దేవుడిని కోరుకుంటున్నాను- ప్రియాంక చోప్రా

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ సైనికుల‌పై జ‌రిగిన భీక‌ర దాడి ఇంకా న‌మ్మ‌శక్యంగా లేదు. ఈ ఘ‌ట‌న‌ని ఎప్ప‌టికి మ‌ర‌చిపోలేము. దాడిలో గాయ‌ప‌డ్డ వారు వేగ‌వంతంగా రిక‌వ‌ర్ కావాల‌ని దేవుడిని కోరుకుంటున్నాను. మ‌ర‌ణించిన వారి ఆత్మ‌ల‌కి శాంతి క‌లిగించాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్నాను.. అక్ష‌య్ కుమార్

పుల్వామా ఘ‌ట‌నకి సంబంధించిన వార్త న‌న్ను ఎంత‌గానో క‌ల‌చి వేసింది. దాడిలో మ‌ర‌ణించిన వారి ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని, వారి కుటుంబానికి దేవుడు కొండంత ధైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నారు - అనుష్క శ‌ర్మ‌


కేవ‌లం బాలీవుడ్‌కి చెందిన సెల‌బ్రిలే కాకుంగా టాలీవుడ్, కోలీవుడ్‌, మాలీవుడ్‌, శాండ‌ల్‌వుడ్‌కి చెందిన ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పుల్వామా ఘ‌ట‌న‌ని తీవ్రంగా ఖండిస్తూ ఉగ్ర‌దాడిలో మ‌ర‌ణించిన సైనికుల ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని, వారి కుటుంబాల‌కి దేవుడు కొండంత ధైర్యం అందించాల‌ని ట్వీట్‌లో తెలిపారు. గాయ‌ప‌డ్డ వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కూడా వారు ఆకాంక్షించారు.
2059
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles