జెర్సీ చిత్రానికి ప్ర‌ముఖుల ప్ర‌శంసలు

Sat,April 20, 2019 08:20 AM
celebrities praise jersey

కుటుంబ అనుబంధాలు, తండ్రీకొడుకుల అనురాగానికి క్రికెట్ నేపథ్యాన్ని మేళవించి భావోద్వేగభరితంగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం జెర్సీ. వయసు లక్ష్యానికి అడ్డుకాదనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందించారు. 36 ఏళ్ల వయసులో క్రికెటర్‌గా నిరూపించుకోవాలనే అర్జున్ తపనను హృదయాల్ని హత్తుకునేలా చూపించారు. ప్రతి ఒక్కరి ప్రయాణంలో ఎన్నో మజిలీలు ఉంటాయి. అవాంతరాలు ఎదురయ్యాయని ప్రయాణాన్ని మధ్యలోనే ఆపడం కాకుండా లక్ష్యాన్ని చేరుకునేవరకు విశ్రమించవద్దని అర్జున్ పాత్ర ద్వారా చక్కగా చూపించారు. అర్జున్ పాత్ర‌లో నాని చ‌క్క‌ని న‌ట ప్ర‌తిభ‌ని క‌న‌బ‌రిచాడు.

తన లక్ష్యానికి, ఉద్యోగానికి దూరమై కుటుంబ బాధ్యతలతో అర్జున్ సతమతమయ్యే సన్నివేశాలతో ప్రథమార్థాన్ని ఎమోషనల్‌గా నడిపించారు దర్శకుడు. తన కొడుకు సంతోషం కోసం అర్జున్ పాత్ర ఎదుర్కొనే సంఘర్షణ రియలిస్టిక్‌గా ఉంటుంది. అర్జున్,నాని పాత్రల నేపథ్యంలో వచ్చే ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది. తన కొడుకు దృష్టిలో ఎప్పటికీ హీరోగానే ఉండాలనే లక్ష్యంతో మళ్లీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకోవడం, రంజీ జట్టులోకి తిరిగి ఆటగాడిగా ఎంపికయ్యే సన్నివేశాల్ని వాస్తవికతకు దగ్గరగా రాసుకున్నారు. ఈ చిత్ర క‌థతో పాటు నాని యాక్టింగ్‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయ్యారు. జూనియ‌ర్ ఎన్టీఆర్, మంచు మ‌నోజ్‌, అల్లు అర్జున్‌, అల్ల‌రి న‌రేష్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. జెర్సీ చిత్రం హృద‌యానికి హ‌త్తుకునే మూవీ అని చెబుతూ చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపాడు బ‌న్నీ. నాని త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టాడ‌ని అన్నారు. నాని కెరీర్‌లో ఇదో బెస్ట్ చిత్రం.గౌత‌మ్ తిన్న‌నూరి చిత్రాన్ని అద్భుతంగా రూపొందించాడు అని ప్ర‌శంస‌లు కురిపించాడు బ‌న్నీ.

1454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles