సాహో టీజ‌ర్‌ని ఆకాశానికెత్తేస్తున్న టాలీవుడ్ సెల‌బ్స్

Thu,June 13, 2019 11:59 AM
celebrities praise saaho teaser

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ యాక్ష‌న్ ఎంటర్ టైన‌ర్ సాహో టీజ‌ర్ కొద్ది నిమిషాల క్రితం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. టీజ‌ర్ మొద‌ట్లో బాదైన‌, హ్యాపీనెస్‌ అయినా నాతో షేర్‌ చేసుకోవడానికి ఎవ్వరూ లేరు అంటూ కథానాయిక శ్రద్ధా కపూర్‌ చెబుతున్న డైలాగ్‌తో పాటు ప్ర‌భాస్ చేస్తున్న స్టంట్స్ , యాక్ష‌న్ సీన్స్ సామాన్య జ‌నాల‌నే కాక సెల‌బ్రిటీల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. హాలీవుడ్ రేంజ్‌లో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్‌పై సుధీర్ బాబు, నితిన్, సురేంద‌ర్ రెడ్డి, సాయి ధ‌ర‌మ్ తేజ్, మారుతి, సుధీర్ వ‌ర్మ‌, బెల్లంకొండ శ్రీనివాస్ , పూరీ జ‌గ‌న్ త‌దిత‌రులు చిత్ర టీజ‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. బిగ్గెస్ట్ యాక్ష‌న్ ఫిలిం కోసం సిద్దంగా ఉండండి. టీజ‌ర్ నిప్పులు చెరుగుతుంటే సినిమా ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో అంటూ వారు ట్విట్ట‌ర్ వేదిక‌గా కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌భాస్ తెలుగు చిత్ర సీమ‌ని ఎక్క‌డికో తీసుకెళ‌తున్నాడ‌ని అంటున్నారు. చిత్ర టీజ‌ర్ చివ‌రిలో శ్రద్ధ.. ‘ఇంత వైలెంట్‌గా ఉన్నారు..’ ఎవ‌రు అని అడగ్గా.. ‘డై హార్డ్‌ ఫ్యాన్స్‌’ అని ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. 150 కోట్ల బడ్జెట్‌తో సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్ర చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతుండ‌గా, ఆగ‌స్ట్ 15న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.
2563
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles