అభిమానుల‌కి భోగి శుభాకాంక్ష‌లు తెలిపిన ఎన్టీఆర్

Tue,January 14, 2020 10:01 AM

తెలుగు లోగిళ్ళ‌లో సంక్రాంతి సంద‌డి నెల‌కొంది. న‌గ‌రాల నుండి ప‌ల్లెల‌కి వెళ్లిన ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పెద్ద పండుగ‌ని ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. ఈ రోజు భోగి పండుగ సంద‌ర్బంగా ఉద‌యాన్నే లేచి భోగి మంట‌లతో స‌రికొత్త ఉద‌యానికి శ్రీకారం చుట్టారు. టాలీవుడ్ సినీ సెల‌బ్రిటీలు త‌మ అభిమానుల‌కి భోగి పండుగ‌తో సంక్రాంతి పండుగ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్, అనీల్ రావిపూడితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా విషెస్ అందించారు.


సంక్రాంతి అంటే హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు.. భోగి మంటలు, వేకువజామునే జంగమదేవరల జేగంటలు, ఢమరుక నాదాలూ.. పిట్టలదొరల బడాయి మాటలు..ఇలా ఎన్నో మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తాయి. పంట చేతి కొచ్చే తరుణంలో, ఆనందం కోలాహలంతో మూడు రోజుల పాటు ఉత్సవం లా చేసుకునే పెద్ద పండగ ఇది. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ అని పండుగ‌ని జ‌రుపుకుంటారు. బొమ్మల కొలువు, భోగి మంటలు, సంక్రాంతి కి అరిసెలు విందులతో ప్రతి ఇల్లు ఒక హరి విల్లవుతుంది. పాడి పశువులను పూజించి, పితృ దేవతలను సంతృప్తి పరచి, వినోదాల నడుమ‌ బంధు మిత్రులతో కలిసి సంక్రాంతిని ఘ‌నంగా జ‌రుపుకుంటాం.

708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles