కోర‌మీసంతో కిరాక్ పుట్టించిన రామ్ చ‌ర‌ణ్‌

Fri,August 2, 2019 01:37 PM

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ అతి త‌క్క‌వ కాలంలోనే స్టార్ స్టేట‌స్ అందుకున్నాడు. మాస్‌, క్లాస్ చిత్రాలే కాకుండా చారిత్రాత్మ‌క చిత్రాల‌లోను న‌టించి ఓ న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇందులో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్నాడు. ఆయ‌న‌కి జోడీగా అలియా భ‌ట్ న‌టించ‌నుంది. భారీ బ‌డ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి లీకులు జ‌ర‌గ‌కుండా ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. ఆ మ‌ధ్య చిత్ర విశేషాల‌ని వివ‌రించ‌డం కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో త‌మ పూర్తి లుక్ రివీల్ కాకుండా ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ టోపీల‌తో కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఇటీవ‌లి కాలంలో వీరిద్ద‌రు కెమెరాకి చిక్కిన సంద‌ర్భాలు కూడా చాలా త‌క్కువే.


ముంబాయిలో జరిగిన కియారా అద్వానీ బర్త్ డే పార్టీలో బాలీవుడ్ ప్రముఖులు సందడి చేసారు. ఈ వేడుకకు కబీర్ సింగ్ హీరో షాహిద్ కపూర్‌తో పాటు సిద్దార్ధ్ మల్హోత్ర, కరణ్ జోహార్ వంటి వాళ్లు హాజరయ్యారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యాడు. కోర‌మీసంతో బ్లాక్ డ్రెస్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఆయ‌న లుక్ కిరాక్ పుట్టిస్తుంది. అభిమానులు చ‌ర‌ణ్‌ని చూసి సంబ‌ర‌ప‌డిపోతున్నారు. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన విన‌య విధేయ రామ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న కియారా క‌థానాయిక‌గా న‌టించిన విష‌యం విదిత‌మే. వీరిద్ద‌రి కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

2506
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles