స‌ముద్రంలో మునిగిపోతామేమోన‌ని భ‌య‌మేసింది: ఛార్మి

Wed,August 7, 2019 10:06 AM
Charmi Kaur shares her experience at ismart shankar shooting

హీరోయిన్ నుండి నిర్మాత‌గా ట‌ర్న్ తీసుకున్న ఛార్మి పూరీ కనెక్ట్స్ బేన‌ర్‌పై మంచి చిత్రాల‌ని నిర్మిస్తుంది. రీసెంట్‌గా ఆమె పూరీతో క‌లిసి ఇస్మార్ట్ శంక‌ర్ అనే చిత్రం రూపొందించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం ఆ స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది ఛార్మి.అయితే సినిమా షూటింగ్ తొలి రోజు నుండి సోష‌ల్ మీడియా ద్వారా అప్‌డేట్స్ ఇస్తూ వ‌స్తున్న ఛార్మి తాజాగా షూటింగ్ స‌మ‌యంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి త‌న ట్వీట్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చింది.

‘ఇస్మార్ట్ శంకర్’లోని ‘ఉండిపో’ అనే రొమాంటిక్ సాంగ్‌ను మాల్దీవులులో చిత్రీకరించాం. కొన్ని షాట్స్‌ని ఇసుక దీవీలో చిత్రీక‌రించాం. అయితే ఆ దీవీ ప్ర‌తి రోజు కొన్ని గంట‌ల పాటు మాత్ర‌మే ఉంటుంది. ఆ త‌రువాత స‌ముద్రం ముందుకు రావ‌డంతో మునిగిపోతుంది. దీవి కనిపిస్తున్న స‌మ‌యంలోనే సాంగ్ షూట్ చేసాం. అయితే సాంగ్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో చాలా భ‌య‌మేసింది. ఎక్క‌డ సముద్రంలో మునిగిపోతామేమోనని వ‌ణుకుపుట్టింద‌ని ఓ వీడియో షేర్ చేస్తూ త‌న అనుభ‌వాన్ని వివ‌రించింది ఛార్మి. షూటింగ్ అయిపోయిన తరవాత యూనిట్ మొత్తం ఫెర్రీ ఎక్కుతున్న స‌న్నివేశాన్ని వీడియోలో గ‌మ‌నించ‌వ‌చ్చు. మాస్ ఎంట‌ర్‌టైనర్‌గా రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.77 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసిన‌ట్టు స‌మాచారం.

2961
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles