కొత్త ప్రొడ‌క్ష‌న్ సంస్థ స్టార్ట్ చేసే ఆలోచ‌న‌లో చై-సామ్

Fri,July 12, 2019 12:31 PM

అక్కినేని నాగ చైత‌న్య‌- స‌మంత ఇద్ద‌రు కొత్త ప్రొడ‌క్ష‌న్ సంస్థ మొద‌లు పెట్టే ఆలోచ‌న‌లో ఉన్నార‌నే వార్త ప్ర‌స్తుతం టాలీవుడ్ స‌ర్కిల్‌లో చక్క‌ర్లు కొడుతుంది. ప్ర‌స్తుతం వీరి ఫ్యామిలీకి సంబంధించిన ప్రొడ‌క్ష‌న్ సంస్థ అన్న‌పూర్ణ బేన‌ర్‌పై ప‌లు చిత్రాల‌ని నిర్మిస్తుండ‌గా, ఈ నూత‌న జంట‌ త‌మ సొంత బేన‌ర్‌లో వినూత్న క‌థా చిత్రాల‌ని నిర్మించాల‌ని ప్లాన్ చేసుకుంటుందట‌. వివ‌రాల‌లోకి వెళితే స‌మంత‌కి ఓ బేబి వంటి మంచి హిట్ ఇచ్చిన నందిని రెడ్డి త్వ‌ర‌లో ఆమెతో మ‌రో చిత్రం చేయ‌నుంద‌ట‌. థ్రిల్ల‌ర్ మూవీగా రూపొంద‌నున్న చిత్రంలో చైతూ కూడా కీల‌క పాత్ర పోషించ‌నున్నాడు. ఈ చిత్రాన్ని త‌మ సొంత ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌లోనే నిర్మించాల‌ని ఈ జంట భావిస్తుంది. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. స‌మంత ప్ర‌స్తుతం 96 చిత్ర రీమేక్‌తో బిజీగా ఉండ‌గా, చైతూ.. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

1239
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles