సూప‌ర్ స్టార్ యాక్ష‌న్ ప్యాక్డ్ చిత్రం మ‌మాంగం ట్రైల‌ర్

Sat,November 9, 2019 11:44 AM

మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన భారీ పీరియ‌డ్ డ్రామా మ‌మాంగం. ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి కేర‌ళ సంప్రాదాయ యుద్ధ‌వీరుడిగా క‌నిపించ‌నున్నారు. 17వ శ‌తాబ్ధం నాటి క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎం ప‌ద్మ‌కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. భరతాపుళ ఒడ్డున పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఐకానిక్ పండుగ నేప‌థ్యంలో ఈ చిత్రం ఉంటుంద‌ట‌. ప్రాచీ తెహ్లన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఉన్ని ముకుందన్‌, అను సితార, మాళవికా మీనన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన తెలుగు వర్షెన్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో మ‌మ్ముట్టి, ఉన్ని ముకుందన్ చేసే క‌త్తి విన్యాసాలు ఆక‌ట్టుకుంటున్నాయి. ప‌లు భాష‌ల‌లో చిత్రాన్ని న‌వంబ‌ర్ 21న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమా అభిమానుల‌లో భారీ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.


816
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles