రికార్డు కలెక్షన్‌లతో దూసుకుపోతున్న ‘చిచ్చోరే’

Thu,September 12, 2019 02:29 PM
Chichchorai teleporting record collections

ముంబయి: బాక్సాఫీస్‌ వద్ద ‘చిచ్చోరే’ సినిమా దూసుకుపోతోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఆరు రోజుల్లోనే రూ. 61 కోట్లు రాబట్టింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, శ్రద్దాకపూర్‌ హీరో హీరోయిన్లుగా నిటించిన ఈ మూవీ బీ-టౌన్‌లో పాజిటివ్‌ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దంగల్‌ సినిమా డైరెక్టర్‌ నితేష్‌ తివారీ దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశాడు.

వీక్‌ డేస్‌లోనే మంచి కలెక్షన్స్‌ రాబట్టిన ఈ మూవీ వీకెండ్‌లో మరో 40 కోట్లు రాబట్టడం చాలా తేలికని ఆయన అన్నారు. కాగా, శుక్రవారం రెండు క్రేజీ ఫిల్మ్స్‌ రిలీజవుతుండడంతో కాస్త పోటీ ఉంటుందని అన్నారు. శ్రద్ధాకపూర్‌, సుశాంత్‌లు చేసిన ఇంతకు ముందు సినిమాలు సాహో, సాంచీరియా కాస్త నిరాశ పర్చినప్పటికీ, ఈ సినిమాతో వారికి ఉపశమనం లభిస్తుందన్నాడు.

2369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles