రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూసిన బాల‌న‌టుడు

Fri,July 19, 2019 10:42 AM

హిందీలోని ‘సంకట్‌ మోచన్‌ హనుమాన్‌’, ‘ససురాల్‌ సియర్‌ కా’ లాంటి సీరియల్స్‌తోపాటు అనేక టీవీ రియాల్టీ షోలలో న‌టించిన బుల్లితెర న‌టుడు శివ‌లేఖ్ సింగ్ (14) రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూశాడు. గురువారం సాయంత్రం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో శివ‌లేఖ్ తండ్రి శివేంద్ర సింగ్‌, త‌ల్లి లేఖ్నా సింగ్‌తో పాటు మ‌రో వ్య‌క్తి గాయాల‌పాల‌య్యారు. బిలాస్ పూర్ నుండి రాయ్‌పూర్ వైపు వెళుతుండగా, వేగంగా వ‌చ్చిన ఓ ట్ర‌క్ వీరి ట్ర‌క్‌ని ఢీకొట్టింది. సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో రాయ్‌పూర్‌లొని ద‌ర్శివా ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. శివ‌లేఖ్ ఘ‌ట‌న ప్రాంతంలోనే క‌న్నుమూయ‌గా, ఆయ‌న త‌ల్లి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఛ‌త్తీస్‌ఘ‌ఢ్‌లోని జంజ్‌గీర్- చంపా శివ‌లేఖ సొంత ఊరు కాగా, ఆయ‌న ప్ర‌స్తుతం ముంబైలో తల్లి తండ్రుల‌తో క‌లిసి నివ‌సిస్తున్నాడు. మీడియా ఇంట‌ర్వ్యూ కోసం శివ‌లేఖ్ రాయ్‌పూర్‌కి వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని వారి ఫ్యామిలీ ఫ్రెండ్ ధీరేంద్ర కుమార్ చెప్పారు. చిన్న వ‌య‌స్సులోనే శివ‌లేఖ్ క‌న్నుమూయడంతో ఇండ‌స్ట్రీలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ఆయ‌న బంధువులు క‌న్నీరు మున్నీరుగా విలపిస్తుండ‌డంతో చూసే వారి గుండె త‌రుక్కుపోతుంది. శివ‌లేఖ్ ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ప్రార్ధించారు.

3006
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles