ఇద్దరు మెగాస్టార్ల అరుదైన కలయిక.. వైరల్ ఫొటో

Sun,April 7, 2019 11:10 AM
Chiranjeevi and Aamir Khan met at Kyoto Airport in Japan

పైనున్న ఫొటో చూశారా.. ఒకరు టాలీవుడ్ మెగాస్టార్.. మరొకరు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. ఈ ఇద్దరూ అనుకోకుండా కలిశారు. అది కూడా మన దగ్గర కాదు. ఎక్కడో జపాన్ దేశంలో. భార్య సురేఖతో కలిసి జపాన్ టూర్‌కెళ్లిన చిరంజీవిని క్యోటో ఎయిర్‌పోర్ట్‌లో కలిశాడు ఆమిర్‌ఖాన్. ఈ ఇద్దరు మెగాస్టార్లు ఎయిర్‌పోర్ట్‌లోనే కాసేపు గడిపారు. చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను ఆమిర్‌ఖాన్ తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. నా ఫేవరెట్ నటుల్లో ఒకరైన చిరంజీవిని అనుకోకుండా కలిశాను.. చాలా ఆనందంగా ఉంది అని ఆమిర్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా చిరంజీవి లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి మూవీ గురించి మాట్లాడినట్లు ఆమిర్‌ఖాన్ చెప్పాడు. సై రా.. మూవీ షూటింగ్‌ను కొన్ని రోజులు పక్కన పెట్టి ఫ్యామిలీతో కలిసి జపాన్ టూర్‌కు వెళ్లాడు మెగాస్టార్. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నాడు.


2462
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles