అన్నయ్య అనుభవమే ఓ రికార్డు: పవన్ కళ్యాణ్

Mon,September 23, 2019 12:09 AM

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన సినిమా సైరా నరసింహారెడ్డి. ఆయనకు జంటగా నయనతార నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమా చాలా రికార్డులు సృష్టింస్తోంది. ఇంకా సృష్టించాలి కూడా. కానీ, అన్నయ్య చిరంజీవి రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరని ఆయన అన్నారు. ఆయన నటించిన సినిమాలే అందుకు ఉదాహరణ. అన్నయ్య కేరీర్లో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనో మైలు రాయి లాంటి వ్యక్తి అని ఆయన అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రావడం నా అదృష్టం. చిరంజీవి గారికి నేను తముడ్ని అయినప్పటికీ, నేను ఆయన అభిమానిని. సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీతత్వం ఉండాలని కోరుకునే వ్యక్తి అన్నయ్య. మీరు(అభిమానులు) నాపై ఇంతగా ప్రేమ చూపిస్తున్నారంటే అది అన్నయ్య చలవే. ఆయనను స్ఫూర్తిగా తీసుకునే నేను మీ ముందున్నాను.


నేను ఇంటర్మీడియట్ సరిగ్గా చదవలేకపోయినందుకు అన్నయ్య పిస్తోలుతో కాల్చుకుందామనుకున్నా. ఆ సమయంలో వదినా, చిన్నన్న నాగబాబు గారు అన్నయ్య దగ్గరికి తీసుకెళ్లారు. అపుడు ఆయన జీవితం గురించి నాకు అనేక వషయాలు చెప్పి, సమాజంలో చాలా మందికి భాదలుంటాయనీ, అంతమాత్రానికే చనిపోతారా.. అని చెప్పడంతో జీవితంపై, కేరీర్‌పై దృష్టి పెట్టాననీ, అన్నయ్య లాంటి వ్యక్తి అందరి కుటుంబాల్లో ఉంటే ఎవరూ ఆత్మహత్య చేసుకోరన్నారు.

సినిమా విషయానికొస్తే.. అన్నయ్య ఏరికోరి ఈ సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ చాలా బడ్జెట్‌తో ఓ స్వతంత్ర సమరయోధుడి కథను తెరపై ఆవిష్కరిస్తున్నారు. నరసింహారెడ్డి లాంటి ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల వల్ల మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. ఇలాంటి వారి చరిత్రను తెలుసుకోవడం, చూడడం మన అదృష్టం. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ కథను పరుచూరి బ్రదర్స్ రెండు దశాబ్దాల పాటు మోశారు. వారందరి శ్రమ వృధా కాకుండా సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఉయ్యాలవాడ అంటే చిరంజీవిగారే గుర్తుకొస్తారని వారు ఈ కథను ఎవరితోనూ తీయలేదు. చాలా రోజుల తరువాత అన్నయ్య సినిమాకు డబ్బింగ్ చెప్పాను. ఎంతో అదృష్టం ఉంటే గానీ ఇలాంటి అవకాశం రాదు. అది కూడా ప్రఖ్యాత స్వాతంత్య్ర సమరయోధుడి కథ కావడం కూడా కలిసొచ్చింది. సాయి మాధవ్ అద్భుతమైన డైలాగులు రాశారు. స్వాతంత్య్ర యోధుల త్యాగాలను గుర్తించేలా ఈ సినిమా తీశారనీ, నాదేశం కోసం.. నా ప్రజల కోసం తీసిన సినిమా ఇదనీ.. ఇందులో నేను కూడా కొంత భాగమైనందుకు సంతోషిస్తున్నాను. ఎవరు ఎన్ని విజయాలు సాధించినా మేము అసూయ పడం. ఎందుకంటే మేమంతా సినిమా జాతి అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమానికి హీరో చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్‌చరణ్, దిగ్గజ దర్శకుడు రాజమౌళి, మెహర్ రమేష్, పరుచూరి బ్రదర్స్ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాలో చిరంజీవికి గురువుగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించగా, కన్నడ నటుడు సుదీప్, రవి శంకర్, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

1539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles