సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి దంపతులు

Mon,October 14, 2019 03:21 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి సోమవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవి దంపతులను సీఎం జగన్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. జగన్‌ను చిరంజీవి శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందించారు. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా ఈ నెల 2న విడుదలై హిట్‌టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సినిమాను కుటుంబ సభ్యులతో వీక్షించాలని జగన్‌ను చిరంజీవి కోరినట్లు తెలిసింది. అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న చిరంజీవి.. ఆయన భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు.

1427
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles