కొర‌టాల‌- చిరు సినిమాపై తాజా అప్‌డేట్

Fri,August 2, 2019 09:29 AM
Chiranjeevi next movie in naxalism backdrop

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మ‌రి కొద్ది రోజుల‌లో చిరు 152వ చిత్రం ప్రారంభం కానుండ‌గా, ఈ సినిమాకి సంబంధించి ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. న‌క్స‌లిజం బ్యాక్‌డ్రాప్‌లో రూపొంద‌నున్న ఈ చిత్రంలో చిరు రెండు పాత్ర‌ల‌లో సంద‌డి చేయ‌నున్నాడ‌ట‌. ఓ పాత్ర కోసం చిరు ఓ పాత్ర‌లో నెరిసిన జుట్టుతో క‌నిపిస్తాడ‌ట‌. ప్ర‌స్తుతం ఆయ‌న ఈ చిత్రం కోసం త‌న లుక్‌ని కూడా పూర్తిగా మార్చుకుంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాలో నయనతారని కథానాయికగా ఎంపిక చేయాల‌నుకుంటున్నారట. చిరంజీవి పుట్టిన రోజున (ఆగస్ట్‌ 22) ఈ సినిమా ప్రారంభం కానుందని తెలిసింది. సెప్టెంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తారట. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిచ‌నున్నారు.

1820
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles