త‌న త‌దుప‌రి సినిమాపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్

Fri,December 28, 2018 08:17 AM
chiru next movie with trivikram

తొమ్మిదిన్న‌ర ఏళ్ళ త‌ర్వాత ఖైదీ నెం 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా అనే పీరియాడిక‌ల్ మూవీతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతుండ‌గా, వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే సైరా త‌ర్వాత చిరు చేయ‌బోవు ప్రాజెక్ట్ ఏమై ఉంటుందా అనే సందిగ్ధం అభిమానుల‌లో కొన్నాళ్ళుగా నెల‌కొని ఉంది. దీనిపై మెగాస్టార్ చిరు విన‌య విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుక‌లో క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌కు ఆప్తుడు, ఆ విధంగా మాకు సన్నిహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో దానయ్య సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో నేను న‌టిస్తున్నానంటూ చిరు స్ప‌ష్టం చేశారు. ఈ కాంబినేష‌న్‌ని సెట్ చేసింది మ‌రెవ‌రో కాదు రామ్ చ‌ర‌ణ్ అని చిరు అన్నారు. కొద్ది రోజులుగా చిరు త‌ర్వాతి ప్రాజెక్ట్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంద‌ని వార్త‌లు రాగా, చిరు స్టేట్‌మెంట్‌తో పుకార్లకి పులిస్టాప్ ప‌డింది.

1921
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles