మరోసారి రీమిక్స్‌తో సంద‌డి చేస్తానంటున్న సుప్రీమ్ హీరో

Fri,December 29, 2017 10:47 AM
chiru steps for kondaveeti movie song

మెగా మేన‌ల్లుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన సాయిధర‌మ్ తేజ్ కెరీర్ తొలి నాళ్ళ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు వైవిద్య‌మైన సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. ఈ మ‌ధ్య జ‌వాన్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన తేజూ ప్ర‌స్తుతం వివి వినాయ‌క్ తో పాటు కరుణాక‌ర‌ణ్‌తో సినిమాలు చేస్తున్నాడు. అయితే గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి చిత్రాల‌లోని సూప‌ర్ హిట్ పాట‌ల‌ని రీమిక్స్ చేసిన తేజూ, ఇప్పుడు మ‌రో పాట‌ని రీమిక్స్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం కోసం 'కొండవీటి దొంగ' సినిమాలోని 'ఛమకు ఛమకు ఛామ్' సాంగ్‌ని రీమిక్స్ చేసి మెగా అబిమానుల‌కి మంచి వినోదాన్ని అందించాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఈ సాంగ్‌కి చిరు వేసిన స్టెప్స్ థియేట‌ర్స్ దద్ద‌రిల్లేలా చేశాయి. ఇప్పుడు మామ‌కి స‌మానంగా స్టెప్స్ వేసి మెగా ఆడియ‌న్స్‌ని తేజూ అల‌రించ‌నున్నాడా లేదా అనేది చూడాలి. వినాయ‌క్ చిత్రం ప్ర‌స్తుతం మ‌స్క‌ట్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ధ‌ర్మాబాయ్ అనే టైటిల్‌ని ఈ మూవీకి ప‌రిశీలిస్తుండ‌గా, ఇందులో అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

1309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles