రేపు ఉదయం చిత్ర‌ల‌హ‌రిలోని పాత్ర‌లు మిమ్మ‌ల్ని క‌లుస్తారు..!

Tue,March 12, 2019 11:02 AM
Chitralahari teaser released tomorrow

మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం నేను శైల‌జ ఫేం కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో చిత్ర‌ల‌హ‌రి అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో క‌థానాయిక‌లుగా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేథ పెతురాజ్‌లు న‌టిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని కూడా వేగ‌వంతం చేశారు. రేపు ఉద‌యం 9గం.ల‌కి టీజ‌ర్‌ని విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించిన యూనిట్ చిత్ర‌ల‌హ‌రిలోని పాత్ర‌లు మిమ్మ‌ల్ని క‌లుస్తాయంటూ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఆక‌ట్టుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. సునీల్ ఈ చిత్రంలో క‌మెడీయ‌న్‌గా అల‌రించ‌నున్నాడు.

1749
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles